Idhe Maa Katha : గురు పవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, తాన్య శ్రీకాంత్, భూమికా చావ్లా, హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి హీరో సుమంత్ అశ్విన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వీరందరూ ఎక్కడ కలుస్తున్నారు ? అసలు ఈ సినిమా కథ ఏంటి ? అనే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని సుమంత్ తెలిపారు. అయితే ఇందులో భూమిక గురించి సుమంత్ ఎన్నో విషయాలను తెలియజేశారు. భూమికను చిన్నప్పుడు ఒకసారి ఫిలింఛాంబర్‌లో చూసి ఈ హీరోయిన్ ఎంతో అందంగా ఉందని భావించాను. ఆ తరువాత ఒక్కడు సినిమా సెట్ లో తనతో కలిసి పని చేయడం ఎంతో హ్యాపీగా అనిపించిందని సుమంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సినిమాలో భాగంగా చివరి 20 నిమిషాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని తెలిపారు. చివరిలో మంచుపై బైక్ రైడ్ చేయాల్సి ఉంటుందని, ఇలా బైక్ రైడ్ చేసేటప్పుడు తనలో కొద్దిగా భయం అనేది ఏర్పడిందని సుమంత్ తెలిపారు. ముఖ్యంగా ఈ స్నో జర్నీలో భూమిక తన బైక్ పై ఎక్కినపుడు తాను ఎంతో హడలిపోయానని, ఎంతో రిస్కీ సన్నివేశంలో తను నటించాల్సిన అవసరం లేదని, ఆ సన్నివేశంలో డూప్ ని కూడా పెట్టవచ్చని, కానీ ఆ సన్నివేశం రియాలిటీగా ఉండడం కోసం భూమిక ఎంతో సాహసం చేశారని, ఆ సమయంలో తనని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని.. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.