Idhe Maa Katha Review : సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఇది మా కథ’. గురు పవన్ దర్శకుడు. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ గొల్లా నిర్మించారు. రోడ్ జర్నీ అడ్వంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 2, 2021) విడుదలైంది. మరి జర్నీ సజావుగా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం..
మహేంద్ర (శ్రీకాంత్), అజయ్ (సుమంత్ అశ్విన్), లక్ష్మీ (భూమిక), మేఘన (తాన్య హోప్) అనే నలుగురు వ్యక్తుల బైక్ జర్నీనే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఒకరికి, మరొకరికి పరిచయం లేని ఈ నలుగురూ వేర్వేరు లక్ష్యాలతో లఢఖ్ కి బైక్ జర్నీ స్టార్ట్ చేస్తారు. నలుగురివీ నాలుగు కథలు. నాలుగు కుటుంబ నేపథ్యాలు. మరి ఈ నలుగురు ఎలా కలుసుకున్నారు. వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా డెవలప్ అయింది.. తమ లక్ష్యాలను చేరుకున్నారా.. ఈ జర్నీలో ఒకరికి మరొకరు ఎలా హెల్ప్ అయ్యారు అనేది మిగతా కథ.
మహేంద్రా పాత్రలో ఒదిగిపోయాడు శ్రీకాంత్. మరోసారి తన మార్క్ చూపించింది భూమిక. ఓ వైపు హౌస్ వైఫ్ గా, మరోవైపు తన తండ్రి డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసే లక్ష్మి పాత్రలో భూమిక నటన ఆకట్టుకుంది. వీరిద్దరి నటన సినిమాకి ప్లస్. ఇక అడ్వంచర్ అజయ్ అనే యూట్యూబర్ గా కనిపించిన సుమంత్ అశ్విన్ ఎప్పటిలాగే సోసోగా సరిపెట్టేశాడు. తన అభినయం మాటెలా ఉన్నా గత చిత్రాల్లో అందంగానైనా కనిపించాడు. ఇందులో కొత్తగా ఉంటుందని ట్రై చేసిన హెయిర్ స్టైల్ తో వింతగా కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి, సెకండాఫ్ లో థర్టీ ఇయర్స్ పృథ్విలతో చేసిన కామెడీ ట్రాక్స్ నవ్వించకపోగా స్టోరీకి స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, పమ్మిసాయి లాంటి వాళ్లంతా పాత్రల పరిధిమేరకు నటించారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించినా, శ్రీకాంత్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే పాట మళ్లీ మళ్లీ వినాలపించేలా ఉంది. ఇలాంటి రోడ్ జర్నీ సినిమాని మరింత అందంగా చూపించే అవకాశం ఉన్నా ఆ వైపు ఫోకస్ పెట్టినట్టు అనిపించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతంతమాత్రమే. ముఖ్యంగా సీజీ వర్క్స్ తేలిపోయాయి.
రోడ్ జర్నీ సినిమాలు అనగానే జిందగీ న మిలేగి దుబారా, జబ్ వుయ్ మెట్, హైవే, కార్వాన్ లాంటి హిందీ సినిమాలు ఎక్కువ గుర్తొస్తాయి. తెలుగులో ఈ జానర్ సినిమాలు అరుదు. అయినప్పటికీ కంటెంట్ నచ్చితే ఏ జానర్ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు హిట్ చేస్తారు. ఎటొచ్చి కథను కన్విన్సింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పడమే అవసరం. ఈ సినిమా విషయంలో రోడ్ జర్నీ సినిమాకు కావలసిన చక్కని కంటెంట్ నే తీసుకున్న దర్శకుడు, కన్విన్సింగ్ గా చెప్పడంలో మాత్రం తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ వరకూ ఎలాగోలా కథ నడిపినా సెకండాఫ్ లో అనవసర కామెడీ, విలన్ సీన్స్ ని జొప్పించి విసుగు తెప్పించాడు. నాలుగు ప్రధానపాత్రల పర్సనల్ లైఫ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బైక్ జర్నీలో వాళ్లకు ఎదురయ్యే స్ట్రగుల్స్ కి కూడా ఇచ్చుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ముఖ్యంగా శ్రీకాంత్, భూమిక క్యారెక్టర్స్ పై పెట్టిన శ్రద్ధ, సుమంత్ అశ్విన్, తాన్యా క్యారెక్టర్స్ లో కనిపించదు. నిజానికి ఈ తరహా సినిమాలకి జర్నీలో ఎదురయ్యే స్ట్రగుల్సే మెయిన్ విలన్స్. కానీ ఇందులో బలవంతంగా విలనిజం, కామెడీ లాంటివి జొప్పించాలనే ప్రయత్నం చేయడంతో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. మొత్తానికి కంటెంట్ పరంగా మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. ఫైనల్ గా.. ఎలాంటి అంచనాలు లేకుండా టైమ్ పాస్ కి అయితే ఓసారి చూసేయొచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…