Hyper Aadi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఆది గురించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అతను ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ వల్ల ఆ హీరోకు చెందిన ఫ్యాన్స్ అతనిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అందుకనే అతను అజ్ఞాతంలోకి వెళ్లాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఆది స్వయంగా స్పందించాడు.
తనపై ఏ హీరో అభిమాని దాడి చేయలేదని, తాను భేషుగ్గానే ఉన్నానని ఆది తెలిపాడు. ఈ మేరకు ఆది ఓ వీడియోను విడుదల చేశాడు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో మాట్లాడుతూ.. తనను ఏ హీరోకు చెందిన అభిమానులు కొట్టలేదని, తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, ఎప్పటిలాగే అందరితోనూ హ్యాపీగా ఉన్నానని.. తెలిపాడు.
#hyperaadi pic.twitter.com/6Z7RcZRHBv
— India Daily Live (@IndiaDailyLive) November 10, 2021
అయితే ఈ మధ్య కాలంలో తనపై అనేక రకాల ఫేక్ వార్తలు వస్తున్నాయని, వాటిని రాసే వారికి తనది ఒక విన్నపమని ఆది అన్నాడు. కావాలంటే అలాంటి వార్తలు రాసేవారికి తానే ఎంతో కొంత డబ్బు ఇస్తానని.. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ రాయొద్దని అతను కోరాడు.