Hyper Aadi : హైపర్ ఆది.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. అంతలా హైపర్ ఆది పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ వేదికపై అతను వేసే పంచ్‌లకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అయితే ఆది పంచ్‌లు వేస్తే చూసేందుకు, వినేందుకు బాగానే ఉంటాయి. కానీ కొన్ని సార్లు అతను వేసే పంచ్‌ల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.
గతంలో పలువురు హీరోలపై పంచ్‌లు వేసిన ఆది ఇబ్బందులు పడ్డాడు. తరువాత క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఆదికి అదే లాంటి పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఓ ప్రముఖ చానల్‌లో నిర్వహించిన షోలో పాల్గొన్న ఆది బాగా సందడి చేశాడు. తన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించాడు. దీంతో షో కూడా బాగానే కొనసాగింది. అయితే ఓ టాలీవుడ్ హీరోపై అతను పంచ్‌లు వేయడాన్ని ఆ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ హీరో అభిమానులు ఆదిని బయట కనిపిస్తే చితక్కొడదాం.. అన్న రేంజ్‌లో ఫైర్ అవుతున్నారట.
ఆ హీరోపై ఆది వేసిన పంచ్‌లకు ఆదిని చితకబాదాలని ఆ ఫ్యాన్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. దీంతో ఆది కనిపిస్తే చాలు, దాడి చేద్దాం.. అన్నంత కసిగా వారు తిరుగుతున్నారట. దీంతో ఆది బయట తిరిగేందుకు భయపడుతున్నాడని, ఒక వేళ తిరిగినా ఎవరికీ కనిపించకుండా వెళ్తున్నాడని.. టాక్ వినిపిస్తోంది.
మరి ఆది ఈసారి కూడా క్షమాపణలు చెబుతాడా ? లేదా అభిమానుల ఆగ్రహానికి గురవుతాడా ? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఆది ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. అయితే అతను వేసే పంచ్‌లు బాగానే ఉంటాయి కానీ, ఒకరిని కించ పరిచేలా పంచ్‌లు వేస్తే.. ఇదిగో.. ఇలాగే జరుగుతుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…