Hyper Aadi : గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం సంచలనంగా మారిన విషయం విదితమే. నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్ భార్య రమ్యకు దొరికిపోవడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే నరేష్, పవిత్ర ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని బయటకు చెప్పక తప్పలేదు. అయితే రమ్యకు మాత్రం ఏవేవో సంబంధాలు ఉన్నాయని నరేష్ ఆరోపించారు. ఆమె తన నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఇలా చేస్తుందని.. ఆమెను ఏనాడో దూరం పెట్టేశానని నరేష్ తెలిపారు.
అయితే రమ్య మాత్రం తనకు విడాకులు ఇంకా ఇవ్వలేదని.. తనకు నరేష్ గన్ చూపించి బెదిరిస్తూ విడాకులు అడుగుతున్నారని ఆరోపణలు చేసింది. పవిత్ర లోకేష్ తమ కాపురంలో చిచ్చు పెట్టిందని తెలియజేసింది. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. తమ వ్యవహారం సూపర్ స్టార్ కృష్ణకు ముందు నుంచే తెలుసని, ఆయనకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించింది. అంతేకాకుండా నరేష్‌కు, తనకు సపోర్ట్‌గా ఉండాలని కోరింది. దీంతో వ్యవహారం మొత్తం ముదిరి పాకాన పడింది. అప్పటి నుంచి ఈ విషయమై ఎలాంటి అప్‌డేట్ లేదు. మీడియాకు ఎక్కకుండానే నేరుగా సమస్యను పరిష్కరించుకోవాలని నరేష్ చూస్తున్నారట. ఇప్పటికే పరువు బాగా పోయింది కనుక బయటకు తెలియకుండా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారట. కనుకనే ఆ తరువాత వీరి గురించి ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే టాపిక్స్‌పై స్కిట్స్ చేసే హైపర్ ఆది తాజాగా పవిత్ర లోకేష్, నరేష్‌లపై కూడా స్కిట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీకి చెందిన తాజా ఎపిసోడ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. శ్రీదేవీ డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్‌లో కమెడియన్లు అందరూ జోడీలుగా వచ్చారు. ఈ క్రమంలోనే నరేష్ వంతు రావడంతో పవిత్ర ముందుకు వస్తుంది. నరేష్‌కు నేనున్నానని పవిత్ర అంటుంది. దీంతో ఆది ఎంట్రీ ఇచ్చి పంచ్ వేస్తాడు. నీ పేరేంటి అని పవిత్రను అడుగుతాడు. పవిత్ర అని ఆన్సర్ ఇస్తుంది. వాడి పేరు ఏంటి అని ఆది అడుగుతాడు. నరేష్ అని పవిత్ర చెబుతుంది. ఇంకేం అన్నట్టుగా ఆది ముఖం పెట్టేసి ఆది సైలెంట్ అవుతాడు. అయితే ఆది ఏం అన్నాడో ఎవరికీ అర్థం కాదు. దీంతో పవిత్ర, నరేష్ అని అంటున్నాడని పంచ్ ప్రసాద్ చెబుతాడు. దీంతో విషయం అర్థం అయి అందరూ పగలబడి నవ్వుతారు. ఇలా ఆది.. నరేష్, పవిత్ర లోకేష్‌లను కూడా వాడేయడంతో ఈ స్కిట్‌ను చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…