Hyper Aadi : జబర్దస్త్ షోలో ఎంతో కాలంగా కమెడియన్‌గా కొనసాగిన కిరాక్ ఆర్పీ ఈ మధ్య మల్లెమాల సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోలో ఎవరికీ మర్యాద ఉండదని.. అన్నింటా అవమానాలే జరుగుతుంటాయని.. అసలు వారు భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదని.. ఆర్‌పీ సంచలన ఆరోపణలు చేశాడు. తమను కేవలం నాగబాబు మాత్రమే ఆదుకున్నారని అన్నాడు. ఆయన వల్లే జబర్దస్త్‌లో ఎంతో మంది సహాయం పొందారని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలకు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్‌లు కౌంటర్ ఇచ్చారు. వారు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
కిర్రాక్ ఆర్‌పీ మల్లెమాల శ్యామ్ ప్రసాద్‌పై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని హైపర్ ఆది, రామ్ ప్రసాద్‌లు అన్నారు. వాస్తవానికి శ్యామ్ ప్రసాద్ అనేక మందికి సహాయం చేశారని అన్నారు. ఆయన రష్మికి ఇల్లు కోసం ష్యూరిటీ ఇచ్చారని.. అలాగే ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు. దొరబాబు ఒక కేస్‌లో చిక్కుకుంటే వేరే సంస్థలు పని ఇవ్వకపోతే మల్లెమాల వారు పని ఇచ్చారని అన్నారు.

సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో ఎలాంటి అవమానాలు జరగలేదని.. ఆది, రామ్ ప్రసాద్‌లు తెలియజేశారు. సుధీర్ కావాలనే తనకు, రష్మికి మధ్య లవ్ ట్రాక్ ఉండేలా స్కిట్‌లు చేసేవాడని.. అలాగే తనపై కావాలనే ఇతర టీమ్ లీడర్స్‌తో పంచ్‌లు వేయించుకునేవాడని.. అతనికి జబర్దస్త్‌లో రెమ్యునరేషన్ తక్కువగా ఉండేదని.. వేరే చానల్ వాళ్లు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామంటేనే అతను వెళ్లాడు కానీ అతనికి, మల్లెమాల వారికి ఎలాంటి విభేదాలు లేవని.. ఆది, రామ్ ప్రసాద్ లు తెలిపారు. ఆర్‌పీ కావాలనే మల్లెమాలపై దుష్ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలోనే ఆది, రామ్ ప్రసాద్‌లు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.