Huzurabad : హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం అయింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ప్రచారం అనంతరం పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే గతంలోకన్నా 2 శాతం ఎక్కువగానే ఈ సారి హుజురాబాద్‌లో పోలింగ్ నమోదు అయింది. మొత్తం 86.33 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో గెలుపు తమదంటే తమది అంటూ.. అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఫలితంపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. 6 నెలల నుంచి జరిగిన రాజకీయ పోరాటంలో గెలుపు ఎవరిదో తేలిపోనుంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు గాను 2 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. ముందుగా 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
2 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లను లెక్కిస్తారు. వాటిల్లో 14 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో రౌండ్‌కు 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం వెల్లడి కానుంది.
కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలోని ఓట్లను 6 రౌండ్లలో లెక్కిస్తారు. అలాగే వీణవంక మండలం ఓట్లను 4 రౌండ్లలో, జమ్మికుంట మండలంలోని ఓట్లను 5 రౌండ్లలో, ఇల్లంతకుంట మండలంలోని ఓట్లను 3 రౌండ్లలో, కమలాపూర్ మండలంలోని ఓట్లను 4 రౌండ్లలో లెక్కిస్తారు. కాగా ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. మరికొన్ని గంటల్లో ఆ ఉత్కంఠకు తెర పడనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…