పూరీలు మెత్త‌గా పొంగుతూ రావాలంటే.. ఏం చేయాలో తెలుసా..?

పూరీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. పూరీల‌ను ఉద‌యం చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తింటుంటారు. పూరీల‌లోకి ఆలు క‌ర్రీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీతోపాటు చికెన్‌, మ‌ట‌న్ వంటివి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. క‌నుక పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొంద‌రు ఎంత చేసినా పూరీలు మెత్త‌గా రావు. పొంగ‌వు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే.. పూరీలు చాలా మెత్త‌గా వ‌స్తాయి. అలాగే పొంగుతాయి. ఎక్కువ సేపు ఉన్నా పూరీలు మెత్త‌గానే ఉంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి. ఇక పూరీలు మెత్త‌గా పొంగుతూ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీల‌ను త‌యారు చేసేందుకు గాను ముందుగా మ‌న‌కు ప‌దార్థాలు కావాలి. ఇందుకు గాను గోధుమ పిండిని 2 క‌ప్పులు, బొంబాయి ర‌వ్వ‌ను పావు క‌ప్పు మోతాదులో తీసుకోవాలి. అలాగే పాలు అర క‌ప్పు, ఉప్పు 1 టీస్పూన్‌, నూనె వేయించేందుకు స‌రిప‌డా తీసుకోవాలి. అలాగే నీళ్ల‌ను కూడా త‌గిన‌న్ని తీసుకోవాలి. ఇక ఇప్పుడు పూరీల పిండిని క‌ల‌పాలి. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని, బొంబాయి ర‌వ్వ‌ను, ఉప్పును వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత పాల‌ను పోసి క‌లిపిన త‌రువాత త‌గినన్ని నీళ్ల‌ను పోసి మరీ మెత్తగా కాకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. 10 నిమిషాల త‌రువాత పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకుని కావ‌ల్సిన ప‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకుని పొడి పిండిని వేసుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా పూరీలను వ‌త్తుకోవాలి.

ఇలా అన్ని పూరీల‌ను చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె వేడ‌య్యాక మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి ఒక్కో పూరీని వేసుకుంటూ గ‌రిటెతో పూరీని నూనె లోప‌లికి వెళ్లేలా వ‌త్తుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు పూరీని మ‌రో వైపున‌కు తిర‌గేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి లేదా హాట్ బాక్స్ లోకి తీసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పూరీలు మెత్త‌గా ఉంటాయి. పూరీ పిండిని క‌లిపేట‌ప్పుడు లేదా పూరీల‌ను వ‌త్తేట‌ప్పుడు నూనెను వాడ‌రాదు. నూనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల పూరీల‌ను కాల్చేట‌ప్పుడు అవి ఎక్కువ‌గా నూనెను పీల్చుకుంటాయి. దీంతో పూరీలు స‌రిగ్గా రావు. క‌నుక పిండిని క‌లిపే స‌మ‌యంలో లేదా పూరీల‌ను వ‌త్తే స‌మ‌యంలో నూనెను ఉప‌యోగించ‌రాదు. దీంతో పూరీలు మెత్త‌గా వస్తాయి. పొంగుతాయి.

అలాగే పూరీల‌ను ఎక్కువ సేపు నూనెలో ఉంచ‌డం వ‌ల్ల అవి గ‌ట్టిగా త‌యార‌వుతాయి. కనుక పూరీలు వేగీ వేగగానే వాటిని వెంట‌నే నూనె నుంచి తీసేయాలి. ఎక్కువ సేపు ఉంచ‌రాదు. దీని వ‌ల్ల పూరీలు మెత్త‌గా పొంగుతూ వ‌స్తాయి. ఇలా ప‌లు చిట్కాల‌ను పాటించడం వ‌ల్ల ఎంతో రుచిక‌ర‌మైన మెత్త‌నైన పూరీల‌ను ఎంచ‌క్కా తిన‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM