Horoscope : అక్టోబరు 2 శనివారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. బుధుడు కన్యా రాశిలోకి తిరోగమనం చెందుతాడు. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల స్థితిలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ఆయా రాశులకు చెందిన వారి ఫలితాలు ఈ రోజు ఇలా ఉన్నాయి.
1. మేషం – ఈ రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేసే పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తారు. నూతన వ్యక్తులను కలిస్తే లాభం కలుగుతుంది.
2. వృషభం – ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. నలుగురిలోనూ గౌరవం పొందుతారు. దంపతులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
3. మిథునం – రాజకీయ నాయకులు అయితే కొన్ని పనులలో అవాంతరాలు వస్తాయి. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. సంతోషంగా గడుపుతారు. బంధువులతో ఆర్థిక లావాదేవీలు చేయరాదు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి.
4. కర్కాటకం – ఈ రోజు వీరికి అదృష్టం బాగుంటుంది. వ్యాపారంలోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు పెట్టుబడి పెట్టరాదు.
5. సింహం – సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు కలసి వస్తుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
6. కన్య – వీరికి కొన్ని అసౌకర్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుస్తారు. బాధ్యతలు పెరుగుతాయి.
7. తుల – వీరు ఈ రోజు సుఖ సంతోషాలతో గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. విలువైన వస్తువును కోల్పోతారు.
8. వృశ్చికం – దాన ధర్మాలు చేస్తారు. ఇతరులకు సహాయ పడతారు. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు మంచి జరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు.
9. ధనుస్సు – వీరికి ఈ రోజు కుటుంబంలో అశాంతి ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
10. మకరం – వీరికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబంలో సంపద పెరుగుతుంది.
11. కుంభం – పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అనవసరపు ఖర్చులు మానుకోండి. స్నేహితులతో గడుపుతారు.
12. మీనం – ఈ రాశి వారు విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పొగడ్తలు లభిస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…