Heroine : ఓ యంగ్ హీరోయిన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంటే చాలు, ఆమె మొదటి సినిమా ఫస్ట్ లుక్ నుంచి విడుదలయ్యే వరకూ దర్శక నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు దృష్టి మొత్తం ఆ హీరోయిన్ పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె నటించిన చిత్రం రిలీజై హిట్ అందుకుంటుందో వెంటనే లక్కీ లేడీ అంటూ దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కట్టేస్తారు. ఈ కోవలో పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరీ చిత్రంతో పరిచయమైన ప్రతి హీరోయిన్ కి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే పూరీ హీరోయిన్ ని అంత గ్లామరస్ గా, రొమాంటిక్ గా అందరి దృష్టి హీరోయిన్ పై పడేలా చూపిస్తారు. ఇలా రొమాంటిక్ సినిమాతో అందరి దృష్టిలోకి వచ్చేసిన పూరీ జగన్నాథ్ హీరోయిన్ కేతిక శర్మ.
కేతిక శర్మ రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేతికా బోల్డ్ సీన్స్ తో చూసే ప్రేక్షకులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అదే రొమాంటిక్ చిత్రం కనుక సక్సెస్ అయ్యి ఉంటే కేతిక శర్మ కెరియర్ మరో విధంగా ఉండేది.
రొమాంటిక్ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్రంలో కేతిక అందాల ఆరబోతకు పిచ్చ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో వరుస సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది ఈ బ్యూటీ. రొమాంటిక్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్య చిత్రంలో కూడా నటించింది కేతిక. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ కేతికకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా ఛాన్సులు కొట్టేసింది కేతికశర్మ.
వైష్ణవ తేజ్ తో రంగ రంగ వైభోగంగా అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ కూడా కేతికనే తన సినిమాలో హీరోయిన్ గా కావాలని అడగడం జరిగిందట. దాంతో పవన్ కళ్యాణ్ నటిస్తూ, నిర్మిస్తున్న తమిళ్ సూపర్ హిట్ వినోదయ సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు, అందులో సాయి ధరమ్ తేజకి జోడీగా కేతికను తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఒక్క హీరోతో నటించి కేతిక శర్మ వరుసగా మెగా హీరోలతో జోడీ కట్టడానికి ఛాన్స్ కొట్టేసింది అంటూ సమాచారం వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే కేతిక రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగినా ఆశ్చర్యపడనవసరంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…