Hebah Patel : కుమారి 21 ఎఫ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హెబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసింది. దీంతో కుర్రకారును ఆకట్టుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హెబా పటేల్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే హీరో రామ్ నటించిన రెడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న హెబా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నటి హెబా పటేల్ ను ఏకంగా నీ వయసెంత ? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు హెబా పటేల్ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని’ తన అసలు వయసు ఎంతో చెప్పకుండా మాట దాటేసింది. అలాగే మరొక నెటిజన్ మీ అందం రహస్యం ఏంటి అని ప్రశ్నించగా ఇది చాలా పెద్ద సీక్రెట్ అంటూనే తన అందానికి గల రహస్యం చెప్పేసింది. దేవుడిచ్చిన అందం కొంత అయితే డాక్టర్ల కృషి మరికొంత అంటూ సమాధానం చెప్పడంతో ఈమె తన అందం కోసం సర్జరీలు చేయించుకుందా.. అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె చెప్పిన ఈ సమాధానాలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…