Heart Attack : ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్ లు అనేవి అత్యంత సహజం అయిపోయాయి. చాలా మంది గుండె పోటు బారిన పడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. పలు కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అయితే గుండె పోటు అనేది సడెన్‌గా వచ్చినప్పటికీ అది వచ్చేందుకు 2, 3 రోజుల ముందే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు. దీంతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. మరి గుండె పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గుండె పోటు వచ్చేందుకు రెండు, మూడు రోజుల ముందే కొందరిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పని చేసినా బాగా అలసిపోతుంటారు. శక్తి లేనట్లు అనిపిస్తుంది. అసలు నడవడానికే శక్తి లేనట్లు అవుతుంది. ఇలా అవుతుంటే కచ్చితంగా గుండె పోటు వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జాగ్రత్త పడాలి.
2. గుండె పోటు వచ్చే ముందు కొందరికి ఛాతిపై బలంగా పట్టేసినట్లు అవుతుంది. ఛాతిపై బరువు పెట్టినట్లు ఉంటుంది. శ్వాస ఆడడం కష్టంగా ఉంటుంది. ఇది కచ్చితంగా గుండెపోటు సంకేతమే. ఇలా ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా ఉంటే ముందే తెలిసిపోతుంది. అప్పుడు ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
3. గుండె పోటు వస్తుందనడానికి మరో సంకేతం.. చెమటలు.. గుండె పోటు వచ్చేవారికి చెమటలు విపరీతంగా పడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమటలు వస్తుంటే.. అది కచ్చితంగా గుండె పోటుకు సంకేతమనే భావించాలి.
4. వికారం, తలతిరగడం, ఎడమ వైపు భుజం, మెడ, దవడ, చేయి నొప్పితో ఉండడం.. వంటివన్నీ గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలే. కనుక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది. ప్రాణాలను కాపాడుకున్నవారమవుతాము.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…