Samantha : దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. శాకుంతలం. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కనిపించనుంది. ఆమెకు జతగా దుష్యంతుడి పాత్రలో మళయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
శాకుంతలం సినిమాలో అసుర పాత్రలో కబీర్ సింగ్ నటిస్తున్నారు. గోపీచంద్ జిల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన కబీర్ సింగ్.. శాకుంతలం చిత్రంలోనూ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అసుర పాత్రలో ఆయన నటించారు. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలను వెల్లడించారు.
తనకు దర్శకుడు గుణశేఖర్ టెస్ట్ లుక్ చేశారని.. ఈ పాత్ర తనకు సరిగ్గా సరిపోయిందని, అందుకని గుణశేఖర్ తనకు అసుర పాత్రను ఇచ్చారని తెలిపారు. ఇక శాకుంతలం సినిమాలో తనకు, దుష్యంతుడి పాత్ర చేసిన దేవ్ మోహన్‌కు మధ్య భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, 10 రోజుల పాటు ఎంతో కష్టపడి యుద్ధ సన్నివేశాలను తీశారని తెలిపారు.
ఈ సినిమాలో భాగంగా తాను 18 కిలోల కిరీటాన్ని ధరించానని, అది ఎంతో భారంగా అనిపించిందని, అలాగే ఛాతిపై ధరించిన రక్షణ కవచం కూడా చాలా బరువుగా ఉండేదని కబీర్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ తన గత చిత్రాలతో పోలిస్తే శాకుంతలంలో తాను భిన్నంగా కనిపిస్తానని.. తనకు ఈ పాత్ర సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…