KGF : పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కెజియఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా మొదటి భాగం కు సీక్వెల్ గా కెజియఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ సొంత రాష్ట్రం అయిన కర్ణాటకతోపాటు సౌత్ మరియు నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. కేజిఎఫ్ చిత్రంతో అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ లకు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
ఈ చిత్రంలో హీరోకి తల్లిగా ఈ చిత్ర కథాంశానికి ఒక అమ్మాయి కీలక పాత్ర పోషించటం జరిగింది. ఈ సినిమాలో రాకీ భాయ్ కి తల్లిగా నటించిన అమ్మాయి ఎవరూ అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు అర్చన జోస్. ఆమె 1994లో బెంగళూరు లో జన్మించింది. అర్చన కర్ణాటకలోని బెంగళూరులో న్యూ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి, అదే పాఠశాలలో నాట్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
అర్చన జోస్ తమిళనాడులోని తంజావూరులో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేసింది. అర్చన మహాదేవి అనే కన్నడ సీరియల్ ద్వారా తొలిసారిగా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మహాదేవి సీరియల్ జీ కన్నడ లో ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో ఆమె సుందరి పాత్రలో మెప్పించి నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత అర్చన కన్నడ చిత్రం కెజియఫ్ లో హీరో యష్ కు తల్లిగా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కెజియఫ్ చిత్రంతో వెండితెరపై పరిచయమైంది నటి అర్చన. 27 ఏళ్ళ అర్చన కెజియఫ్ లో హీరో యష్ తల్లిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కెజియఫ్ చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి అర్చన జోస్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…