Trivikram : సినీ దర్శకులు సహజంగానే సినిమాలను తెరకెక్కించేటప్పుడు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. కొందరు దర్శకులకు ట్రెయిన్ సీన్లు అంటే సెంటిమెంట్. అందుకని తమ సినిమాల్లో ట్రెయిన్ సీన్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక కొందరు దర్శకులు హీరోయిన్ల పేర్లపై సెంటిమెంట్ పెట్టుకుంటారు. అందుకనే వారు తీసే సినిమాల్లో దాదాపుగా హీరోయిన్ల పేర్లు ఒకటే అయి ఉంటాయి. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా అనేక సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. వాటిల్లో హీరో బ్యాగులు ధరించి తిరిగే సెంటిమెంట్ కూడా ఒకటి.
అతడు సినిమాలో మహేష్ బాబు, జల్సాలో పవన్ కల్యాణ్, ఖలేజాలో మహేష్ బాబు, అ..ఆ..లో నితిన్, జులాయిలో అల్లు అర్జున్, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా సినిమాల్లో హీరోలు బ్యాగులు ధరించి కొన్ని సీన్లలో కనిపిస్తారు.
అయితే ఈ సినిమాల్లో దర్శకుడు పాటించిన ఇంకో సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. అదేమిటంటే.. హీరో ఒక చోట ఉండడు. అన్ని చోట్లకూ తిరుగుతుంటాడు. ఈవిధంగా త్రివిక్రమ్ కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అయితే సెంటిమెంట్ ను అనుసరించినంత మాత్రాన సినిమా హిట్ కావాలని ఏమీ లేదు. కానీ త్రివిక్రమ్ మూవీల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. అందుకనే దర్శకులు చాలా వరకు సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఆ మాట కొస్తే హీరోలు కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవడం మనం చూస్తూనే ఉన్నాం..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…