Viral Photo : ఇటీవల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోషల్ మీడియా వినియోగం తప్పనిసరైంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ విశేషాలన్నింటినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పలువురు హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేయగా.. ఎన్టీఆర్ ఓల్డ్ రేర్ ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు.. తెలుగులో స్టార్ హీరో.. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవుతున్న ఈ హీరో తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. వరుసపెట్టి కమర్షియల్ సినిమాలు చేసి.. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తాజాగా కొమరం భీమ్ క్యారెక్టర్‌లో మరోసారి నటన విశ్వరూపాన్ని చూపించాడు. ఈపాటికే మీరు గుర్తుపట్టి ఉంటారు. అది మరెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
నిన్ను చూడాలని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం 1తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆది, సింహాద్రి, యమ దొంగ, టెంపర్, అరవింద సమేత వీర రాఘవ లాంటి కమర్షియల్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో జీవించేశారని ఫ్యాన్స్ అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…