Actress : తమకిష్టమైన హీరో, హీరోయిన్ల ఫోటోలను అభిమానులు భద్రంగా దాచుకుంటుంటారు. ఇక హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ పిక్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు. సాయి పల్లవి, అనుష్క, శ్రియా, రాశి ఖన్నా.. ఇలా ఎందరో హీరోయిన్ల చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమాయకంగా కనిపిస్తోన్న ఈ బుజ్జాయి తెలుగులో నటించిన తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇక మూడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. తన లేటెస్ట్ ఫొటోస్, సినిమా అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. వరుసగా టాప్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. మీకు ఈపాటికే ఆమె ఎవరో గుర్తొచ్చి ఉండాలే.. రాలేదా..!
ఈమెవరో కాదండీ.! బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత నటించిన ముకుంద సినిమాతో నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఇక దువ్వాడ జగన్నాథం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు ఫెయిల్యూర్ గా నిలిచాయి. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతోనైనా పూజ వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…