అక్కినేని వారసుడు అఖిల్ ఏప్రిల్ 8న 27వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తాను నటించబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. కొన్ని రోజుల నుంచి అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్లో రాబోయే సినిమా”ఏజెంట్” కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడమేకాకుండా, సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ లుక్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి.స్పై థ్రిల్లర్ జానర్‌లో దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అదేవిధంగా సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.
చేతిలో సిగరెట్ తో పొగను వదులుతూ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న “ఏజెంట్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు కూడా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…