Money : డబ్బు సంపాదించడం అన్నది ప్రస్తుత తరుణంలో ఎంతటి కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించలేక చాలా మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేస్తున్నారు. దీంతో అవి తీర్చలేక మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ చేతిలో డబ్బు నిలవడం లేదని వాపోతున్నారు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతుందని విచారిస్తుంటారు. కానీ ఈ సమస్యలకు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణమవుతుంది. అలాగే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా ఉండాలి. అది లేకపోయినా ఆర్థిక సమస్యలు వస్తాయి. మరి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా చాలా మంది ఇళ్లలో వివిధ రకాల పూలమొక్కలను పెంచుతుంటారు. వాటిల్లో సన్నజాజి మొక్క ఒకటి. చాలా మంది ఇళ్లలో ఈ మొక్క ఒక్కటే ఉంటుంది. కానీ దీంతోపాటు విరజాజి అనే మొక్క కూడా ఉంటుంది. దీన్ని కూడా ఇంట్లో పెంచాలి. ఈ రెండు మొక్కలనూ లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తారు. కనుక ఇంట్లో సన్నజాజి మొక్కను పెంచుతున్న వారు దాంతోపాటు విరజాజి మొక్కను కూడా పెంచాల్సి ఉంటుంది. దీంతో లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఇక పైన తెలిపిన రెండు మొక్కలతోపాటు ఇంటి పెరట్లో తులసి మొక్కను కూడా పెంచాలి. తులసి సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. కనుక సన్నజాజి, విరజాజి, తులసి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది.
ఇక ఈ మొక్కలకు చెందిన పువ్వులను కోసి సాయంత్రం సమయంలో మాలగా చేసి లక్ష్మీ నారాయణుల చిత్రపటాలు లేదా విగ్రహాలపై వేయాలి. తరువాత పూజ లేదా దీపారాధన చేయాలి. కనీసం రెండు అగరువత్తులను అయినా వెలిగించాలి. ఇలా పూలను మాలగా తయారు చేసి దాన్ని వేసి పూజ చేసే వరకు ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకుంటూ ఉండాలి. ఇలా రోజూ చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై కలుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు పోయి డబ్బును బాగా సంపాదిస్తారు. ఇలా ధనాన్ని పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…