Godfather Movie On OTT : ఎన్నో ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి ఆ తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు చిరు. అయితే రీ ఎంట్రీ ఇచ్చాక ఒక్క ఖైదీ నంబర్ 150 తప్ప ఏ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. సైరా మూవీ ఫర్లేదు అనిపించినా ఆచార్య ఫ్లాప్ అయింది. ఇక ఆ తరువాత వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్లు అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు తలపట్టుకున్నారు. సినిమా సక్సెస్ అయిందని చెప్పి సక్సెస్ మీట్‌లు అయితే నిర్వహించారు. కానీ కలెక్షన్లు అనుకున్నంత రాకపోవడంతో మేకర్స్‌కు ఈ మూవీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి. అయితే గాడ్ ఫాదర్ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీకి గాను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ప్రసారం కానుంది. అయితే ఓటీటీలో అనుకున్న తేదీ కన్నా కాస్త ముందుగానే రిలీజ్ చేయాలని మేకర్స్ కోరారట. అందుకు గాను కాస్త పారితోషికం ఎక్కువ వస్తుందని.. దీంతో నష్టాలను కాస్తయినా తగ్గించుకోవచ్చని ప్లాన్ చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ మూవీని అనుకున్న తేదీ కన్నా ముందుగా రిలీజ్ చేసేందుకు అంగీకరించలేదట. దీంతో నవంబర్ 19న ఈ మూవీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది. ఆ తేదీ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.

కాగా గాడ్ ఫాదర్ మూవీకి గాను మొత్తం రూ.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఆ మేర కలెక్షన్స్‌ను అయితే రాబట్టలేదు. దీంతో మూవీ ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. మళయాళంలో హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ వచ్చింది. ఇందులో నయనతార, సత్యదేవ్‌తోపాటు ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ కీలకపాత్రలో నటించాడు. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య అనే చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిల్లో భోళా శంకర్ ముందుగా వస్తుంది. ఇది కూడా తమిళ రీమేక్ కావడం విశేషం. తమిళంలో వచ్చిన అజిత్ మూవీ వేదాళంకు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.