Godfather Chiranjeevi : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినవి అవడంతో సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. దీంతో ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంది. కరోనా ప్రభావంతో సగటు మనిషి జీవితం తారుమారయ్యింది. ఇప్పుడిప్పుడే బతుకు బండి తిరిగి పట్టాలెక్కుతోంది.
ఇలాంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న ఓ సామాన్య మనిషి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువ ఖర్చు చేయలేక పోతున్నాడు. ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకున్న సినీ పరిశ్రమ వరుసగా సినిమాలను భారీ టికెట్ రేట్లతో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ రోజున టికెట్ దొరకడం గగనంగా మారేది. అప్పట్లో టికెట్ రేటు సాధారణంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎంత పెద్ద స్టార్ అయినా పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.
అందుకే ఇప్పుడు స్టార్స్ తమ ఆలోచనని మార్చుకున్నారు. టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవబోతున్న మెగా మూవీస్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా టికెట్ల రేట్లు తగ్గించుకున్నాయని తెలుస్తుంది. అక్టోబర్ 6 నుంచి గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70 ఎంఎంలో టికెట్ రేటు 150 రూపాయలకే అందుబాటులో ఉంది. మొదటి రోజు కూడా దాదాపు అంతే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగాస్టార్ మెగా ప్లాన్ నిజంగానే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. మరి తగ్గిన టికెట్ రేట్లతో అయినా చిరు సూపర్ హిట్ కొడతాడా.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…