Godfather 2nd Day Collections : గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి కెరీర్ లో వసూళ్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేటర్ల వద్ద జోరు కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి అనుకూలంగా విపరీతంగా పాజిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇక రెండవ రోజైన గురువారం నాడు ఈ చిత్రం రూ.31 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఇది చాలా భారీ మొత్తం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.69 కోట్ల గ్రాస్ సాధించినట్లైంది.
రీమేక్ రాజాగా పిలవబడే దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవి చెల్లెలుగా నయన తార కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మొదటి సారిగా తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఈ గాడ్ ఫాదర్ సినిమా ఆచార్య కంటే కూడా థియేటర్ల పరంగా తక్కువ సంఖ్యలోనే విడుదల అయ్యింది.

ప్రస్తుతం టికెట్ రేట్లు కూడా ఇదివరకంటే తక్కువగానే ఉండడం గమనించవచ్చు.అయినప్పటికీ మంచి వసూళ్లు సాధించడం సంతోషించదగిన విషయం అని చెబుతున్నారు. దసరా సీజన్ సెలవులు ఈ చిత్రానికి బాగా కలసి వచ్చాయని విశ్లేషకుల అభిప్రాయం. వీకెండ్ కలెక్షన్లు ఇంకా భారీగా ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు.