Sree Leela Dance : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా వచ్చిన చిత్రం.. పెళ్లి సందD. ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే అప్పటికి కరోనా ప్రభావం కాస్తు ఉండడం చేత ఈ మూవీ బాగున్నప్పటికీ థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులను రప్పించలేకపోయింది. అయినప్పటికీ ఇందులో నటించినందుకు గాను శ్రీలీలకు మంచి మార్కులే పడ్డాయి. నటిగా తానేంటో నిరూపించుకుంది. ఇక గ్లామర్ షో కూడా చేసింది. హీరోయిన్ అయ్యేందుకు ఇంకా ఏం కావాలి.. దీంతో ఆమెకు సహజంగానే ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే శ్రీలీల పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.
అయితే పెళ్లి సందD సినిమాలోని మధురానగరిలో అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించగా.. ఆయన స్వర పరిచిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. మధురానగరిలో పాట అయితే ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈపాటకు ఇప్పటికే ఎంతో మంది డ్యాన్స్‌లు చేసి తమ సరదాను తీర్చుకున్నారు. అయితే ఈ పాటకు ఓ యువతి డ్యాన్స్ చేసి అబ్బురపరిచింది.

మధురానగరిలో పాటలో శ్రీలీల ఎలా డ్యాన్స్ చేసిందో అచ్చం అలాగే ఓ యువతి డ్యాన్స్ చేసి అలరిస్తోంది. సేమ్ శ్రీలీల వేసినట్లుగానే స్టెప్స్ వేయడం విశేషం. శ్రీలీల లాగే ఈమె కూడా గ్లామర్ షో చేస్తూ ఆ పాటకు స్టెప్పులేసింది. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి డ్యాన్స్ చేస్తున్నందుకు సిగ్గుగా లేదా.. ఇంట్లో మీ పేరెంట్స్ ఏమనుకుంటారో అన్న జ్ఞానం లేదా.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ ఈమె వీడియో మాత్రం తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు ఇప్పటికే సుమారుగా 3.80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 17వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె వీడియో ట్రెండ్ అవుతోంది.