Viral Video : ప్రస్తుత తరుణంలో చాలా మంది సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఎవరిని చూసినా బుల్లెట్టు పాట పాడుతున్నారు. ఆ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఏ ఫంక్షన్‌లో అయినా సరే ఈ పాటే ప్రధానంగా మనకు వినిపిస్తోంది. రామ్ నటించిన ది వారియర్ సినిమాలోని బుల్లెట్టు పాట బాగా వైరల్ అవుతోంది. సినిమా రిలీజ్ అయి ఇప్పటికే ఎన్నో రోజులు గడుస్తున్నా.. ఈ పాటకు మాత్రం ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. చాలా మంది ఈ పాటకు డ్యాన్స్ చేసి తమ సరదా తీర్చుకుంటున్నారు.
ఇక బుల్లెట్టు పాటకు డ్యాన్స్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు చెందిన డ్యాన్స్ వీడియోలే మనకు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా గౌర్ హిమన్షి ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. నిజానికి ఆమెది నార్త్ ఇండియా. అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కనుకనే వైరల్ అవుతున్న ఈ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కాగా హిమన్షి బుల్లెట్టు పాట వైరల్ అవుతందని తెలిసి ఆ పాటకు రీల్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఆమె హీరోయిన్ కంటే కూడా బాగా డ్యాన్స్ చేసిందని అంటున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram