Bullet Song : ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు పెద్దవారు చేసే డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా , ఉల్లాసంగా ఉంటాయి. అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు.
పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ మరింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెటబ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. అంతేకాకుండా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా తమకు ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ యువతి చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ చిత్రం రిలీజ్ కాక ముందు నుంచి ఒక పాట బాగా ఫేమస్ అయింది. ఈ చిత్రంలోని బుల్లెట్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో మంది వీడియోలను క్రియేట్ చేసి రీల్స్ లో అప్‌లోడ్ చేశారు.
View this post on Instagram
బ్యూటిఫుల్ నేచర్ లో రెడ్ చెక్స్ స్కర్ట్, వైట్ షార్ట్ తో నడుము వయ్యారంగా తిప్పుతూ బుల్లెట్ సాంగ్ కి స్టెప్స్ వేస్తూ ఈ అమ్మాయి కుర్రాళ్ళ మది దోచేస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. సూపర్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ అమ్మడి డాన్సుపై మీరు ఓ లుక్కేయండి.