Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కొందరైతే ఏకంగా హీరోలుగా కూడా చేస్తూ ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుధీర్ టీం ఒకటి. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే వారు. దీంతో జనాల్లో వీరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.
దీంతో సుడిగాలి సుధీర్ టీమ్ పేరుపై రామ్ ప్రసాద్ కొత్తవారితో స్కిట్స్ చేస్తున్నాడు. కాగా ఇటీవల గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో రామ్ ప్రసాద్ కి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్న గెటప్ శ్రీను జబర్దస్త్ కి ఎందుకు తిరిగి వచ్చాడనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అదే సమయంలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువ అనే సందేహాలు కలుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం గెటప్ శ్రీను కంటే రామ్ ప్రసాద్ అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తుంది. రామ్ ప్రసాద్ నటుడే కాదు, రైటర్ కూడా.. సుడిగాలి సుధీర్ టీమ్ కి స్క్రిప్ట్స్ రాసేది రామ్ ప్రసాదే.

అలాగే ఇతర టీమ్స్ కి కూడా స్క్రిప్ట్స్ అందిస్తాడు. అలా రామ్ ప్రసాద్ కు చాలా డిమాండ్ ఉంది. రామ్ ప్రసాద్ ఒక కాల్ షీట్ కి లక్షన్నర రూపాయల వరకు తీసుకుంటున్నాడట. ఇక గెటప్ శ్రీను కాల్ షీట్ కి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడట. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రామ్ ప్రసాద్ చేస్తున్నాడు. ఆ షో ద్వారా రామ్ ప్రసాద్ మరికొంత సంపాదిస్తున్నాడు. అయితే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సినిమా అవకాశాలతో అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. చాలా తక్కువ లెవెల్ నుంచి ఈ ముగ్గురు కమెడియన్స్ బుల్లితెర స్టార్స్ గా ఎదిగారు. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో ఓ మూవీ చేయడం విశేషం.