Garikapati : ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు గురించి అందరికీ తెలుసు. ఆయన అనేక అంశాలపై ఎంత సేపైనా మాట్లాడగలరు. పురాణాల్లోని అనేక విషయాల గురించి ఆయన అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్లు చాలా వివరంగా చెబుతుంటారు. అప్పటి శాస్త్రాలలోని అంశాలను నేటి తరానికి తగినట్లు.. ఇప్పటి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతుంటారు. అలాగే మధ్య మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తుంటారు కూడా. ఇక ఈ మధ్య కాలంలో ఆయన పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా స్పందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకే అధిక ప్రాధాన్యతను కల్పించారని.. ఎన్‌టీఆర్‌ను అసలు ఎలివేట్ చేయలేదని.. ఫ్యాన్స్ గొడవ పడుతున్న విషయం విదితమే. అయితే ఇదే విషయంపై గరికపాటి కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలు ఆయన ఏమన్నారంటే.. సినిమాల్లో హీరోలకే కాదు.. క్రికెట్ ప్లేయర్లకు కూడా భారీగా ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన నటుడు లేదా క్రికెటర్‌కు చిన్న గాయమైనా వారు తట్టుకోలేరు. అంతలా అభిమానులు ఉంటారు. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు వాళ్లకు అవమానాలు జరుగుతుంటాయి. దీంతో ఆ అవమానం ఏదో తమకే జరిగిందని ఫ్యాన్స్ భావిస్తారు. చేయరాని తప్పులు చేస్తారు. అది సరికాదు. అలా చేయడం వల్ల ఆ హీరో లేదా క్రికెటర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.. అని గరికపాటి అన్నారు.
అప్పట్లో ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్, ఎస్‌వీఆర్.. ఇలా అనేక మంది నటులు తమకు వచ్చిన పాత్రకు నో చెప్పకుండా చేశారు. అందుకనే వారు గొప్ప నటులు అయ్యారు. అంతేకానీ.. తమ హీరోకు చిన్న పాత్ర వచ్చిందని అభిమానులు ఫీల్ కాకూడదు. అది హీరోను ఎదగనివ్వదు. హీరో తరువాత సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. తక్కువ పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమోనని హీరో భావిస్తాడు. ఇది అతని ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కనుక ఫ్యాన్స్ అంతలా శ్రుతి మించకూడదు.. పాత్ర చిన్నదే అయినా, హీరోకు అవమానం జరిగినా.. అది సినిమా.. దర్శకుడు చెప్పింది వినాలి.. హీరోకు స్వాతంత్య్రం ఇవ్వాలి. ఫ్యాన్స్ ఒత్తిడి తేకూడదు.. అని గరికపాటి చురకలంటించారు. మరి దీనిపై ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌ల ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…