Garikapati : దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా ప్రతి ఏడాది బండారు దత్తాత్రయ కుటుంబం ఈ వేడుకను నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్పీచ్ తో ఆకట్టుకున్నారు.
అలాగే ఈ వేడుకకు చిరంజీవితోపాటు ప్రముఖ వేదాంతి గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవితో ఫోటోలు దిగడానికి పిల్లలు మరియు మహిళలు వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా వేదికపైనే చిరంజీవి ఫొటో సెషన్ నిర్వహించడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో గరికిపాటి ప్రసంగం ప్రారంభించడం, మరోవైపు చిరంజీవితో సెల్పీలకు జనం ఎగబడటంతో విసుగెత్తిపోయారు.
చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి వెళ్లిపోతా అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ది చెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…