Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దసరా పండుగ సందర్భంగా మరో సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. బిగ్ దసరా సేల్ పేరిట ప్రారంభం కానున్న ఈ సేల్ ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. ఇందులో అనేక కంపెనీలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులపై భారీ రాయితీలను అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్ లు, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రికల్ గృహోపకరణాలను తగ్గింపు ధరలకు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అయితే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సేల్ అక్టోబర్ 3 నుంచే అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సేల్‌లో భాగంగా యాపిల్, శాంసంగ్, రియల్‌మి, వివో, ఒప్పో వంటి కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఈ సేల్‌లో ఐఫోన్ 13ను రూ.50వేల తగ్గింపుకు కొనవచ్చు. అలాగే గెలాక్సీ ఎఫ్23 5జి ఫోన్‌పై కూడా ఇలాంటి డిస్కౌంట్‌నే అందిస్తున్నారు. అలాగే నథింగ్ ఫోన్1, గూగుల్ పిక్సల్ 6ఎ వంటి ఫోన్లను కూడా తగ్గింపు ధరలకు పొందవచ్చు. ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ ఎత్తున డిస్కౌంట్‌ను పొందవచ్చు. కీబోర్డులు, కంప్యూటర్ యాక్ససరీలు, మౌస్ ప్యాడ్స్, టచ్ ప్యాడ్‌లపై, పవర్ బ్యాంకులపై 75 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు. ఇలా ఈ సేల్‌లో ఎన్నో వస్తువులను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.