Faria Abdullah Dance : జాతిరత్నాలు మూవీ ద్వారా సక్సెస్‌ను అందుకున్న బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా. ఈమె డ్యాన్స్ చేయడంలో పెట్టింది పేరు. అందుకనే బంగార్రాజు మూవీలో ఓ ప్రత్యేక పాటలో చైతూ, నాగ్‌ల పక్కన డ్యాన్స్ చేసి అలరించింది. ఇక ఫరియా అబ్దుల్లా సామాజిక మాధ్యమాల్లోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె జాతిరత్నాలు మూవీలో తనదైన శైలిలో క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. అయితే సినిమా హిట్ అయినా ఈమెకు ఆఫర్లు మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో చిన్న అతిథి పాత్రలో నటించి అలరించింది.
ఇక ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే మొన్నా మధ్య ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె డ్యాన్స్ చూసిన యువత ఉర్రూతలూగిపోయారు. చిట్టి ఏంటి.. ఇలా డ్యాన్స్ చేసింది.. అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఈమె బెల్లీ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈమె గతంలో ఒకసారి సిమ్రాన్ చౌదరితో కలిసి డ్యాన్స్ రిహార్సల్‌లో పాల్గొంది. ఆ సమయంలో ఫరియా వేసిన డ్యాన్స్ స్టెప్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. దీంతో సిమ్రాన్ చౌదరి సైతం చిట్టి డ్యాన్స్ కు ఆశ్చర్యపోయింది.

ఇక ఈమెకు చెందిన ఆ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో పాతదే అయినా.. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఏంటి.. ఈమె ఎలా డ్యాన్స్ చేసింది.. ఈమె ఇలా కూడా చేస్తుందా.. అని షాకవుతున్నారు. అందులో ఈమె అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేయడం విశేషం. ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లకు మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు. కొందరు బాగా చేశావని కామెంట్స్ పెడుతుంటే.. కొందరు గుండెల్లో మంట పెట్టేశావు.. అని అంటున్నారు. ఇక ఫరియా డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
https://www.youtube.com/watch?v=HecTYP9j9_0