Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం.. ఆచార్య.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫెయిల్ అయ్యేందుకు అనేక కారణాలు ఉన్నాయని రోజుకో వార్త బయటకు వస్తోంది. ఇక ఈ మూవీ ఇంకొద్ది రోజుల్లో ఓటీటీలోనూ విడుదల కానుంది. సాధారణంగా ప్రస్తుతం రిలీజ్ అవుతున్న అగ్ర హీరోల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతోంది. కానీ ఆచార్య మాత్రం 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండడం విశేషం. అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఆచార్య ఫ్లాప్‌ను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరగా ఇంకో మూవీ రిలీజ్ అయి హిట్ అయితే బాగుండును.. అని అనుకుంటున్నారు. ఇక చిరంజీవి తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ఆయన త్వరలో గాడ్ ఫాదర్ గా కనిపించనున్నారు.
గాడ్ ఫాదర్ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. దాని తరువాత భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే చిరంజీవి వచ్చే రెండేళ్లలో అధిక సంఖ్యలో సినిమాలు చేసేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అదేమిటంటే..

తమిళంలో కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ వంటి ఇతర స్టార్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే చిరంజీవిని కూడా అలా ఇతర స్టార్స్‌తో కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. మెగా కాంపౌండ్‌కు చెందిన వారు కాకుండా సత్యదేవ్, నవదీప్ వంటి వారు లేదా ఎన్టీఆర్, విశ్వక్ సేన్, నాగచైతన్య వంటి హీరోలతో సినిమాలు చేస్తే.. అప్పుడు సినిమాకు మంచి జోష్ వస్తుందని.. దీంతో సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. కనుక చిరంజీవి అలాంటి ప్రయోగం చేయాలని వారు ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను చిరంజీవి నెరవేరుస్తారా.. లేదా.. అన్నది చూడాలి.