Extra Jabardasth : బుల్లి తెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్న కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఇప్పటికే మల్లెమాల ప్రొడక్షన్ లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు పోటీగా ఎన్ని కార్యక్రమాలు వచ్చినా వెనక్కి నెట్ట లేకపోయాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో నిర్వాహకులు ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలలో ఎన్నో ట్విస్టులు పెడుతూ ఆద్యంతం ఈ కార్యక్రమంపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ అందరూ స్కిట్ చేయగా చివరికి రాకింగ్ రాకేష్ స్కిట్ చూసిన మనో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్కిట్ అనంతరం మాట్లాడుతూ ఏంటి ఇది అని అడగగా అందుకు రాకేష్ స్కిట్ అని సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళి పోయారు.
ఇక రోజా మనోను ఆపడానికి ప్రయత్నించినా ఆయన వినలేదు, ఈ క్రమంలోనే స్టేజీ దిగి వెళ్ళిపోతుండగా రాకేష్ రాకేష్ టీం అడ్డుకొని పైకి రండి సార్ అని బతిమాలగా ముందు మీరు వెళ్ళండి అంటూ కోపగించుకున్నారు. ఇక రాకేష్ టీం సభ్యులు సారీ చెప్పబోతున్నా మనో వెంటనే తనని కొట్టడానికి చేయి పైకెత్తారు. ఈ క్రమంలోనే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది ప్రోమో కోసమే ఇలా చేశారా లేకపోతే నిజంగానే మనో సీరియస్ అయ్యారా.. అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…