Exra Jabardasth : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎమ్మాన్యుయెల్, వర్ష జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన కాంబినేషన్ లో ఈ జంట విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంటోంది. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం వర్ష గురించి సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్స్ తో ఎంతో బాధపడింది. అప్పటి నుంచి ఎమ్మాన్యుయెల్ తో కలిసి స్కిట్ చేయడం కూడా కొంత వరకు తగ్గించిందని చెప్పవచ్చు.
తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎమ్మాన్యుయెల్ మరొక అమ్మాయితో కలిసి స్కిట్ చేశాడు. ఈ స్కిట్ లో భాగంగా కాస్త నా పెదాలు తడపొచ్చు కదా అంటూ ఎమ్మాన్యుయెల్ అడగడంతో అందుకు ఆ అమ్మాయి నీళ్లు తీసుకొచ్చి ఎమ్మాన్యుయెల్ ముఖాన కొడుతుంది.
దీంతో షాకైన అతను పెదాలు తడపడం అంటే ఇలా కాదు, నీకు తెలియకపోతే వర్షను అడిగి తెలుసుకో.. అంటూ కామెంట్ చేశాడు. తన పెదవులు తడపమంటే సునామీలా కుమ్మేస్తుంది అంటూ కామెంట్ చేశాడు.
ఈ మాట విన్న వర్ష ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ స్కిట్ లో భాగంగా నూకరాజు తన చివరి కోరికగా వర్షను హగ్ చేసుకోవాలని ఉందని అడగడంతో అందుకు స్పందించిన వర్ష తొక్కలో పకోడీ గాడికే ఇచ్చాను నీకు ఇవ్వడం ఏముంది అంటూ ఎమ్మాన్యుయెల్ ముందు నూకరాజును హగ్ చేసుకుంది. దీంతో ఎమ్మాన్యుయెల్ షాక్ అయ్యాడు. ఇలా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.