Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించడమే సమంత చేసిన తప్పు. అసలు సమస్యంతా అక్కడే మొదలైంది. అభిమానులు తన పట్ల సానుభూతిని వ్యక్తపరుస్తారు కావచ్చని సమంత ఊహించి ఉండవచ్చు. కానీ సీన్ రివర్స్ అయింది. వాస్తవానికి అక్కినేని కుటుంబానికి అభిమానులు ఎక్కువే. అదే సమంత కొంప ముంచింది. ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీ అభిమానులే సమంతను ట్రోల్ చేశారని సులభంగా అర్థమవుతుంది.
అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోల్స్ రావడం సహజమే. సాక్షాత్తూ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వంటి వారే ట్రోల్స్ బారిన పడుతుంటారు. కొద్ది రోజులు ట్రోల్స్ నడుస్తాయి. తరువాత అవే ఆగిపోతాయి. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ చానల్స్ ఎంటరై సమంత ఇష్యూను మరింత లోతుగా తీసుకువెళ్లాయో అక్కడే సమస్యంతా ప్రారంభమైంది.
అసలు ఉన్నవీ, లేనివీ అన్నీ కల్పించుకుని మరీ సమంత పరువు ప్రతిష్టలను దెబ్బ తీసే విధంగా వారు కించ పరిచేలా మాట్లాడుతూ వీడియోలు పెట్టారు. అలాంటి వీడియోలు పెడితే సమంత లాంటి సెలబ్రిటీలే కాదు, సాధారణ పౌరులకు కూడా నిజంగా పరువు నష్టమే కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్టుల దాకా వెళ్లి తేల్చుకోవాల్సిందే. తప్పదు.
అయితే.. కోర్టుకు వెళ్లినా.. అక్కడ ఏం జరిగింది ? న్యాయమూర్తే క్షమాపణలు అడగాలని సూచించారు. నిజానికి ఇలాంటి కేసుల్లో ఒక వేళ శిక్ష వేయదలిస్తే పెద్దగా శిక్ష పడదు. హత్యలు, మానభంగాలు చేసినవాళ్లే రెండు రోజులకే బెయిల్ తెచ్చుకుంటున్న రోజులివి. అలాంటిది ఇలాంటి కేసుల్లో పెద్ద పెద్ద కఠిన శిక్షలు పడతాయని ఊహించకూడదు. కానీ సమంత విషయంలో సదరు యూట్యూబ్ చానల్స్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. అసలు ఆమె సాధించినదేమిటి ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇప్పుడైతే వివాదం సద్దు మణిగింది. యూట్యూబ్ చానల్స్ కాస్తంత తగ్గినా.. మళ్లీ వారు చేసేదే చేస్తారు. ఎందుకంటే.. యూట్యూబ్‌లో అలాంటి వీడియోలకే నిజానికి వ్యూస్ ఎక్కువ. అంటే.. ప్రజలే అలాంటి వీడియోలు అంటే ఇష్టపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరలాంటప్పుడు యూట్యూబ్ చానల్స్ మారుతాయా ? కొన్ని రోజులు అలాగే ఉండి.. మళ్లీ తమ యథావిధి పనులను కొనసాగిస్తారు.
నిజానికి ఇది ఒక చక్రం లాంటిది. గతంలోనూ యూట్యూబ్ చానల్స్ విషయంలో ఇలాగే వివాదం నెలకొంది. తరువాత సద్దుమణిగింది. ఇదిగో.. సమంత విడాకుల విషయమై మళ్లీ ఇప్పుడు ఇలా యూట్యూబ్ చానల్స్ తెరపైకి వచ్చాయి. కొంతకాలం మళ్లీ వారి నోళ్లు మూగబోతాయి. కానీ మళ్లీ యథావిధిగానే అన్నీ నడుస్తాయి. మరి గుణపాఠం ఎవరు నేర్చుకున్నారు ? అంటే.. ఇది ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న. కానీ కోర్టు వరకు వెళ్లడం వల్ల సమంతకు కాస్తో కూస్తో ఊరట లభించిందని చెప్పవచ్చు. ఆమెను తిట్టే నోళ్లకు కొంత వరకు తాళం పడుతుంది. అయినా.. మళ్లీ ఏ సెలబ్రిటీ అయినా వార్తల్లో నిలిస్తే.. ఇది ఇలాగే కొనసాగుతుంది. అది కాదనలేని సత్యం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…