Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. బిగ్బాస్షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో రచ్చ చేస్తున్నాడు. టాప్ టీఆర్ఫీతో ఈ షో దూసుకుపోతోంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ అలరిస్తున్నారు.
ఈ షోకి సామాన్యులతోపాటు సెలబ్స్ కూడా హాజరవుతున్నారు. మొదటి గెస్ట్‌గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకు వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. ఇక మహేష్ కూడా హాజరు కాబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం అవుతోంది.
డిసెంబర్ 4న రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు షో ప్రసారం కానుంది. గంటన్నర పాటు సాగనున్న ఎపిసోడ్ లో మహేష్ ఎన్టీఆర్ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచనున్నారు. చివరిగా మహేష్, ఎన్టీఆర్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. ఈ వేడుకలో మహేష్-ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఎన్టీఆర్.. మహేష్ ని అన్న అని సంబోధిచడం, మహేష్.. ఎన్టీఆర్ ని తమ్ముడు అనడం.. ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది. మరి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో, ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…