Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే త్వరలో ఓ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ ఎపిసోడ్‌కు చెందిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో మహేష్ బాబు, ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూస్తుంటే రెండు కళ్లూ చాలడం లేదు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.
మహేష్ బాబు పాల్గొననున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 4 గంటల్లోనూ 10 లక్షల మంది ఈ ప్రోమోను వీక్షించారు. ఇందులో మహేష్ అదిరిపోయే లుక్‌లో కనిపించి సందడి చేశారు.
https://youtu.be/DCwU8pNi9A8
మహేష్ బాబును ఎన్‌టీఆర్ షోలో.. మహేష్ అన్న అని సంబోధిస్తూ ఆహ్వానించారు. ఇక హాట్ సీట్‌లో కూర్చోగానే మహేష్ జోక్ చేశారు. ఒక ప్రశ్నకు జవాబును అటు తిప్పి ఇటు తిప్పి కన్‌ఫ్యూజ్ చేస్తూ అడుగుతారెందుకు ? అని మహేష్ అడగ్గా.. అందుకు తారక్.. ఊరికే సరదాకి, జోక్‌గా.. అని చెబుతూ నవ్వేశారు. కాగా ప్రోమో అయితే రిలీజ్ చేశారు, కానీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.