Evaru Meelo Koteeshwarulu : జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు (EMK) షోకు గాను ఎన్‌టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. దసరా సందర్భంగా సమంతకు చెందిన స్పెషల్ ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. అయినప్పటికీ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రేటింగ్స్ రావడం కష్టంగా మారింది. అయితే ఈ షోకు గాను ఎన్‌టీఆర్ అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో నవంబర్ మొదటి వారం వరకు ప్రసారం కానుంది. అయితే ఎన్‌టీఆర్ అన్ని ఎపిసోడ్స్‌కు చెందిన షూటింగ్‌ను పూర్తి చేశారు కనుక ఇకపై ఆ ఎపిసోడ్స్ ముగిసే వరకు ప్రసారం చేస్తారు. ఆ తరువాత సీజన్‌ను ఎప్పుడు ప్రారంభించేది, హోస్ట్‌గా ఎవరు వచ్చేది.. తరువాత వెల్లడిస్తారు. కానీ తరువాత సీజన్‌కు కూడా ఎన్‌టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకుంటారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ కూడా గతంలో గెస్ట్‌లుగా వచ్చారు. మోహన్ బాబు, తమన్, దేవిశ్రీప్రసాద్ వంటి వారితోనూ పలు ఎపిసోడ్స్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్స్ ప్రసారం కావల్సి ఉంది. వాటిని దీపావళి రోజు ప్రసారం చేస్తారని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆరంభంలో అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆ రేటింగ్స్ తరువాత వారాల్లో నిలబడలేదు. దీంతో పలువురు సెలబ్రిటీలతో ప్రయత్నం చేశారు. అవి కూడా విఫలం అయ్యాయి. ఇక ఎన్‌టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…