Erica Fernandez : గాలిపటం, డేగ అనే సినిమాల ద్వారా ఎరికా ఫెర్నాండెజ్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఈమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్స్ షేప్‌లపై షాకింగ్ కామెంట్లు చేసింది. హీరోయిన్లు బక్క పలుచగా ఉంటే ఎవరూ చూడరని, అందుకు గాను వారు మంచి షేప్‌లో కనిపించేందుకు మేకర్స్ వారికి ప్యాడింగ్ పెడతారని చెప్పుకొచ్చింది.

తనను బక్క పలుచగా ఉండేదని చాలా మంది ఎగతాళి చేశారని ఎరికా ఫెర్నాండెజ్ విచారం వ్యక్తం చేసింది. అయితే తాను ఈ విషయంపై ఎల్లప్పుడూ బాధపడలేదని, తనను తానుగా చూసుకోవడమే తనకు ఇష్టమని.. మంచి సైజ్‌లో కనిపించాలని తనకు ప్యాడింగ్స్ పెట్టడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది.
ఇక హీరోయిన్స్ బక్క పలుచగా ఉంటే ప్రేక్షకుల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తాయేమోనని దర్శక నిర్మాతలకు భయం అని తెలిపింది. అందుకనే హీరోయిన్స్ అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్ షేప్‌లో కనిపించేందుకు వారికి శరీరంలో పలు భాగాల్లో ప్యాడింగ్స్ పెడతారని తెలిపింది. కాగా ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. బక్క పలుచగా ఉన్నా.. అందాల ఆరబోతలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఈమె నిరూపిస్తోంది.