Drishyam 2 : వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో అప్పట్లో వచ్చిన దృశ్యం మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మళయాళ సినిమా రీమేక్ అయినప్పటికీ దృశ్యంను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఈ మూవీకి మళయాళంలో దృశ్యం 2ను తీశారు. దాన్ని తెలుగులోనూ మళ్లీ వెంకటేష్ రీమేక్ చేశారు.
రీమేక్‌లోనూ అదే తారాగణం నటించారు. అయితే ఈ మూవీని థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ సురేష్ బాబు ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో సంప్రదింపులు జరిపారు. కానీ డీల్ కుదరలేదని తెలిసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దృశ్యం 2 మూవీని అమెజాన్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే దృశ్యం 2 మూవీ అమెజాన్‌లో ప్రసారమవుతుందని సమాచారం.
ఇక ఈ మూవీలో వెంకటేష్ సరసన మీనా నటించగా.. నదియా, ఎస్తెర్ అనిల్, నరేష్‌లు కూడా మళ్లీ రిటర్న్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా విడుదల ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఇక వెంకటేష్ నటించిన నారప్ప కూడా ఓటీటీలో స్ట్రీమ్ కాగా.. ఆయన రెండో చిత్రం దృశ్యం 2 కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండడం విశేషం.
ఇక వెంకటేష్ నటిస్తున్న ఎఫ్3 ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…