Turmeric Milk : పసుపును భారతీయలు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. పసుపును నిత్యం అనేక వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వంటి వైరస్‌లతోపాటు బాక్టీరియాలను ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. ఈ సీజన్‌లో సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాంటి వారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
3. పసుపు మన చర్మాన్ని ఎంతగానో రక్షిస్తుంది. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
4. నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
5. కీళ్ల నొప్పులు ఉన్నవారు, గాయాలు, దెబ్బలు, పుండ్లు అయిన వారు పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
6. సైనస్ సమస్య ఉన్నవారు రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఛాతి పట్టేయడం, కఫం తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…