ఆది, చెన్న కేశవరెడ్డి, దిల్, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వి.వి.వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం రాలేదు. ఆ మధ్య విడుదలైన ఖైదీ 150 హిట్ అయినా, ఇంటిల్లిజెంట్ అయినంతగా ఆకట్టుకోలేదు. ఆది వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన వినాయక్ ఆ తరువాత వెంటనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశారు. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్‌లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
తాజాగా చెన్నకేశవరెడ్డి సినిమా విశేషాలను దర్శకుడు వి.వి.వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రొడ్యూసర్ బెల్లకొండ సురేష్ ద్వారా బాలకృష్ణకు కథ చెప్పగానే ఒకే చేశారని, స్టోరీ ఒకే చేసిన ఒక వారంలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టామన్నారు. ఈ సినిమా ద్వారా ఓ పెద్ద హీరోను హ్యాండిల్ చేయగలనని తనకు మంచి పేరు వచ్చిందన్నారు. అయితే తాను బాలకృష్ణను ఓ రేంజ్‌లో చూపించాలనే ఆలోచనతో కథ మీద ఫోకస్ తగ్గిందేమో అనిపించిందన్నారు.
ఈ సినిమాలో టబు చేసిన క్యారెక్టర్‌కు మొదట సౌందర్యని అనుకున్నాం. బెంగుళూరుకు వెళ్లి స్టోరీ కూడా చెప్పాం. ఇందులో యంగ్, ఓల్డ్ రెండు పాత్రలు ఉంటాయని చెప్పాం.. కానీ అప్పుడే ఓల్డ్ క్యారెక్టర్లు వద్దు వినయ్ గారు అని సౌందర్య తిరస్కరించారు. నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా సౌందర్యతో నాలుగైదు సినిమాలు చేశా. ఇక ఎవరిని తీసుకుందామని అనుకుంటూ ఉండగా.. టబు గుర్తొచ్చారు. వెంటనే ఆమెను కలిస్తే ఒప్పుకున్నారు. శ్రియను తీసుకోవాలని మేము ముందుగానే అనుకున్నాం.. అని వి.వి.వినాయక్ అప్పటి సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…