Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల సంఖ్య ఎక్కువే మరి. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో కెమెరా ముందుకు వచ్చి తమ టాలెంట్ ని ప్రజంట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన తమ్ముళ్ళకు కూడా ఇండస్ట్రీ అంతే రెస్పెక్ట్ ఇస్తుంది.
ఇక ఆయన తమ్ముళ్ళు కూడా చిరు బాటలోనే నడుస్తూ.. ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఒకే ఒక హీరోయిన్ నిహారిక. మరి నిహారికకు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరంటే ఎక్కువ.. అనే విషయాన్ని బయటపెట్టేసింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన నిహారిక.. తన ఫ్యామిలీ, పర్సనల్ విశేషాలను చాలా వరకు షేర్ చేసుకుంది. నవంబర్ 22న ఈ ప్రోగ్రామ్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ప్రముఖ టీవీ ఛానల్ లో వస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది.
నిహారిక తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న బాండింగ్ గురించి.. తన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ గురించి చెప్పింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. వీరి ముగ్గురిలో నిహారికకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగిన ప్రశ్నకు నిహారిక క్లారిటీ ఇచ్చింది.
నాన్న లేకుంటే చచ్చిపోతా అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా ఇష్టమని చెప్పింది. మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా.. అని అడిగితే.. చిన్నప్పుడు ఓ సారి కొట్టారని.. అది కూడా వీపు మీద అని చెప్పింది. నాగబాబు, నిహారికను మమ్మీ అని పిలుస్తారట.
అలాగే వరుణ్ తేజ్ తనను ముద్దొస్తే.. బంగారం అని, ఇంకా ముద్దొస్తే పంది.. అని పిలుస్తాడట. ఈ షోకి సంబంధించిన ప్రోమోతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.