Sye Movie : రాజమౌళి సినిమా అంటేనే చాలు హీరో ఎవరు అని కూడా చూడకుండానే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడతారు. దర్శక ధీరుడికు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి చిత్రంతో తెలుగు చిత్రాల ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు రాజమౌళి. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన ప్రతి చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించి కొత్త రికార్డులను సృష్టించింది.
ఇప్పటివరకు రాజమౌళి తీసిన 12 చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్లాయి. ఆయన దర్శకత్వంలో సినిమా ఆఫర్ వచ్చిందంటే చాలు నటీనటులు కథ వినకుండానే ఓకే చెప్పే అంత క్రేజ్ ఉంది రాజమౌళికి. కానీ ఇలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఒక హీరోకి సినిమా ఆఫర్ ఇస్తే నో చెప్పారట. రాజమౌళి డైరెక్షన్‌లో నితిన్, జెనీలియా నటించిన చిత్రం సై. స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు తెలియని రగ్బీ అనే ఆటను పరిచయం చేశారు. మొదటిగా ఈ చిత్రంలో నటించడానికి రాజమౌళి ఒక స్టార్ హీరోని హీరోగా పెడదామని అనుకున్నారట. ఆ హీరో ఇంకెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సై చిత్రం కోసం ముందుగా రాజమౌళి పవన్ కళ్యాణ్ సంప్రదించగా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది అంటూ కథను రిజెక్ట్ చేశారని సమాచారం. పవన్ రిజెక్ట్ చేయడంతో సై సినిమా ఆఫర్ ను నితిన్ దక్కించుకున్నాడు. అప్పటికే జయం, దిల్ చిత్రాలతో హీరోగా సక్సెస్ ని అందుకున్న నితిన్ సై చిత్రంతో హ్యాట్రిక్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.