Arundhati Movie : అరుంధ‌తి సినిమాలో అనుష్క చేసిన పాత్ర‌ను ముందుగా వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Arundhati Movie : కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఆ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను బాగానే భ‌య‌పెట్టారు. అయితే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అరుంధ‌తి ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అందులో అనుష్క శెట్టి రెండు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది. ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరిగింది కూడా ఈ సినిమాతోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక అప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో అందాల‌ను ఆర‌బోసిన అనుష్క ఈ మూవీలో సంప్ర‌దాయ బ‌ద్దంగా క‌నిపించి అల‌రించింది.

ఇక అనుష్క శెట్టి అరుంధ‌తి చిత్రంలో ఏకంగా త‌న న‌ట విశ్వ‌రూపం చూపించింది. బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న ఈ సినిమా అనుష్క జీవితాన్నే మార్చేసింది. అప్ప‌టి నుంచి అరుంధ‌తి అంటే అనుష్క‌, అనుష్క అంటే అరుంధ‌తి అని ప్రేక్ష‌కుల మ‌న‌సులో బ‌లంగా ముద్ర ప‌డింది. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు అయిన కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనుష్క మెయిన్‌ లీడ్‌గా న‌టించిన ఈ సినిమా విడుద‌లై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Arundhati Movie

వాస్త‌వానికి ఈ సినిమా ఛాన్స్ తొలుత అనుష్క‌కు రాలేదట‌. మ‌ళ‌యాళం హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ను అరుంధ‌తి సినిమా కోసం సంప్ర‌దించార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ అప్పుడే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మ‌మ‌తా మోహ‌న్ దాస్‌కు ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాల‌నేది పెద్ద‌గా తెలియ‌క అప్ప‌టికే ఇత‌ర ప్రాజెక్టుల‌ను చేస్తుండ‌టంతో అరుంధ‌తిని వ‌దులు కోవాల్సి వ‌చ్చింద‌ని.. గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో మ‌మ‌తామోహ‌న్‌దాస్‌ చెప్పుకొచ్చింది. అరుంధ‌తి ఆఫ‌ర్ వ‌చ్చిన రెండు నెల‌ల‌కే త‌న‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్టు తేలడంతో సినిమా చేయ‌డం కంటే బ‌తికుంటే చాలు అనే భావ‌న‌తో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ట్టు కూడా పేర్కొంది.

ఆ త‌రువాత ఆ క‌థ అనుష్క వ‌ద్ద‌కు రావ‌డం.. క‌థ న‌చ్చి ఆమె ఓకే చెప్ప‌డం అన్నీ చ‌కచ‌కా సాగిపోయాయి. ఇక ఈ చిత్రం విడుద‌ల అయిన త‌రువాత అనుష్క‌ను జేజ‌మ్మ‌, అరుంధ‌తి అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. టాలీవుడ్ లో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెడితే.. ఇప్పుడున్న హీరోయిన్ల‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు అరుంధ‌తి పునాది వేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. అరుంధ‌తి త‌రువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వ‌చ్చినా అవి అంత‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేదు. దీంతో అరుంధ‌తి చిత్రం ఆ స్థాయిలో ఇప్ప‌టికీ నిల‌బ‌డే ఉంది. ఇది అనుష్క కెరీర్‌లో కూడా ఉత్త‌మ చిత్రాల్లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM