Tagore Movie : బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఠాగూర్ మూవీని వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా ?

Tagore Movie : ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథను మలచుకుంటుంటారు రచయితలు . కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. దర్శకుడు వారు ఊహించుకున్న హీరోకి కథ నచ్చకపోవడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటివి కారణాలు కావచ్చు. అప్పుడప్పుడూ ఒక హీరో వదులుకున్న ఆ చిత్రాలే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.

2003 లో ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్రాలలో ఠాగూర్ చిత్రం కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రం అవినీతిని అరికట్టే పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో చిరంజీవి ఈ చిత్రంలో చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. చిరంజీవి ఠాగూర్ చిత్రంలో చెప్పే ప్రతీ డైలాగ్ చూసే ప్రేక్షకులతో థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. షియాజీ షిండే, ప్రకాష్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, సునీల్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రతి ఒక్కరు తమ‌ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తమిళంలో సక్సెస్ ను అందుకున్న రమణ చిత్రానికి రీమేక్ మన తెలుగు ఠాగూర్ చిత్రం.

Tagore Movie

ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఒక హీరో మిస్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశారు. అతనే యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. మొదట ఠాగూర్ చిత్ర కథను దర్శకుడు వి.వి.వినాయక్ హీరో రాజశేఖర్ కి వినిపించాడట. కానీ అదే టైమ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్ ఠాగూర్ చిత్రాన్ని వదులుకోవడం జరిగింది. ఆ టైం లో రాజశేఖర్ ఆయుధం చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందువలన ఠాగూర్ చిత్రానికి నో చెప్పేసారు రాజశేఖర్. రాజశేఖర్ వదులుకున్న ఈ చిత్రమే వి వి వినాయక్ చిరంజీవితో చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఏ చిత్రం కోసమైతే రాజశేఖర్ ఠాగూర్ చిత్రాన్ని వదులుకున్నారో అది కాస్తా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. రాజశేఖర్ ఠాగూర్ చిత్రం చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది అంటూ నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share
Mounika

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM