ED దాడుల్లో ప‌ట్టుబ‌డే డ‌బ్బును ఏం చేస్తారో తెలుసా..?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్) దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట ప‌డుతోంది. రూ.500, రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు గుట్ట‌లు గుట్ట‌లుగా ల‌భిస్తున్నాయి. చాలా మంది మోసం చేసి లేదా నేరాలు చేసి న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌కేస్తున్నారు. అలాంటి డ‌బ్బు మొత్తం ED దాడుల్లో ప‌ట్టుబ‌డుతోంది. ఈ మ‌ధ్యే కోల్‌క‌తాకు చెందిన ఓ వ్యాపార‌వేత్త ఇంట్లో ED దాడులు చేసి రూ.17 కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని స్వాధీనం చేసుకుంది.

ఇక ఇటీవ‌లే బెంగాల్ మంద్రి ఇంట్లో రూ.27 కోట్ల న‌ల్ల‌ధ‌నం, బంగారు ఆభ‌ర‌ణాలు ల‌భించాయి. వాట‌న్నింటినీ ED అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేర‌కు కేసులు కూడా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ED దాడుల్లో ల‌భించిన మొత్తం రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఇలా దాడుల్లో ప‌ట్టుబ‌డిన న‌ల్ల‌ధ‌నం లేదా బంగారం వంటి వాటిని ఏం చేస్తారు ? అనే ప్ర‌శ్న చాలా మందికి ఉత్ప‌న్నం అవుతుంటుంది. అయితే అలాంటి డ‌బ్బును లేదా విలువైన వ‌స్తువుల‌ను ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ED

దేశంలో ఎక్క‌డైనా స‌రే మ‌నీ లాండ‌రింగ్ లేదా న‌ల్ల‌ధ‌నం దాచి ఉంచార‌ని, నేరం చేశార‌ని, అక్ర‌మంగా ధ‌నం, విలువైన వ‌స్తువుల‌ను క‌లిగి ఉన్నార‌ని స‌మాచారం అందితే.. ఈడీ లేదా సీబీఐ లేదా ఐటీ శాఖ అధికారులు దాడులు చేయ‌వ‌చ్చు. ఇక ఆ దాడుల్లో ప‌ట్టుబ‌డిన డ‌బ్బును లేదా ఆభ‌ర‌ణాల వంటి విలువైన వ‌స్తువుల‌ను సీజ్ చేస్తారు. ఆ డ‌బ్బు, వ‌స్తువులు అన్నీ సంబంధిత శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తారు. ఆ వివ‌రాల‌ను కోర్టులో అంద‌జేస్తారు.

అయితే కేసు విచార‌ణ జ‌రిగి నిందితులు దోషులు అని తేలితే.. వారి నుంచి అంత‌కు ముందు స్వాధీనం చేసుకున్న న‌ల్ల‌ధ‌నం లేదా విలువైన వ‌స్తువుల‌ను ఏవి ఉన్నా స‌రే వాటిని చ‌ట్ట ప్ర‌కారం.. కేంద్ర ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తారు. అప్పుడు కేంద్రం వాటిని సంక్షేమ ప‌థ‌కాల‌కు లేదా అభివృద్ధి కోసం వాడుతుంది. ఇక దోషులు ఒక వేళ బ్యాంకు మోసానికి పాల్ప‌డి ఉంటే.. వారు బ్యాంకుల‌కు ఏమైనా బ‌కాయి ఉంటే.. అప్పుడు అలా స్వాధీనం చేసుకున్న సొమ్ము లేదా వ‌స్తువుల‌ను బ్యాంకుల‌కు అప్పు కింద జ‌మ చేస్తారు. దీంతో బ్యాంకుల‌కు అప్పులు తీర్చిన‌ట్లు అవుతుంది.

అయితే ఒక వేళ అధికారులు పెట్టిన కేసులు నిల‌బ‌డ‌క నిందితులు నిర్దోషులు అని తేలితే మాత్రం అధికారులు త‌మ అటాచ్‌మెంట్‌లో లేదా ఆధీనంలో ఉంచుకున్న ధ‌నం, వస్తువులు అన్నింటినీ మ‌ళ్లీ వెన‌క్కి ఇచ్చేయాలి. ఇలా ఈ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈడీ దాడుల్లో భారీ మొత్తంలో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట ప‌డుతుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM