Vikram Movie : కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ విక్రమ్. ఈ చిత్రం గత జూన్ నెల 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. విక్రమ్ చిత్రం తెలుగుతోపాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా విడుదలై ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఓటీటీ వేదిక కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..
తొలి రోజే రూ.45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విక్రమ్ ఆ తర్వాత కొద్ది రోజులకే రూ.150 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న విక్రమ్ చిత్రం ఆ తర్వాత కలెక్షన్లు రాబట్టికునే పరంగా తగ్గుతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ విక్రమ్ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతూనే ఉంది. కోలివుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ చిత్రం కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది.
తమిళనాడులో ఈ చిత్రం రూ.184 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ రాబట్టింది. కేరళలో కూడా ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్, రూ.17 కోట్ల షేర్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.25 కోట్ల గ్రాస్ వస్తే రూ.12 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమా తనదైన స్టైల్ లో రికార్డులను సృష్టించింది. రూ.34 కోట్ల గ్రాస్, రూ.18 కోట్ల షేర్ రాబట్టింది. ఇక మిగిలిన ప్రాంతాలలో రూ.18 కోట్ల గ్రాస్, రూ.8 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.
ఇక ఓవర్ సీస్ మార్కెట్ అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ రూ.125 కోట్ల గ్రాస్, రూ.59 కోట్ల షేర్ ను వసూలు చేసింది. విక్రమ్ చిత్రం భారీ కలెక్షన్లతో యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఊహించని రేంజ్ లో లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ప్రపంచం వ్యాప్తంగా రూ.426 కోట్ల గ్రాస్, రూ.207 కోట్ల షేర్ ను వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసింది.
ఈ సినిమాను తెలుగులో విక్రమ్ హిట్ లిస్ట్ పేరుతో హీరో నితిన్, సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఈ నెల 8 నుంచి ఓటీటీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…