Bandla Ganesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా పలు సినిమాలు తీస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించిన బండ్ల గణేష్ కి రాజకీయాలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో కొద్ది రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కి గతంలో కోర్టు జైలుశిక్ష విధించడమే కాకుండా పెద్ద మొత్తంలో జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనకి కోర్టు ఎందుకు శిక్ష విధించింది, అన్న విషయానికి వస్తే.. టెంపర్ సినిమా కథ అందించిన వక్కంతం వంశీ బండ్ల గణేష్ పై వేసిన కేసులో భాగంగా వాదోపవాదనలు విన్న న్యాయస్థానం బండ్ల గణేష్ కు జైలుశిక్ష విధించడమే కాకుండా ఏకంగా రూ.15,86,550 జరిమానా విధించింది.
కోర్టు బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించిన అనంతరం బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన బండ్లగణేష్ బెయిలుపై వెంటనే బయటకు వచ్చారు. అయితే కోర్టు ఈ విధంగా తనకు శిక్ష విధించడానికి గల కారణం.. రూ.25 లక్షల చెక్ బౌన్స్ కేసే. అందులో భాగంగానే ఆయనకి కోర్టు ఇలాంటి శిక్ష విధించింది. ఇక చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా తీస్తానని ఇటీవలే చెప్పారు. మరో వైపు మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ వేసి కూడా.. చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…