Bathroom Chappals : సాధారణంగా ప్రతి వస్తువు మనకి 2 విధాలుగా లభిస్తుంది. ఒక వస్తువు బాగా ఎక్కువ ధరలోనూ, తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. కొన్ని వస్తువులు అయితే బ్రాండ్ పేరు చెప్పి అధిక ధరకి అమ్మడం కూడా జరుగుతుంది. అయితే ఆ బ్రాండ్ మీద నమ్మకంతో వినియోగదారులు ఆ వస్తువులు కొంటూ ఉంటారు. బడాబడా కంపెనీలు తమ బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా వినూత్న ఉత్పత్తులతో మార్కెట్లోకి తెస్తాయి.
కానీ జర్మనీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హ్యూగో బాస్ (Hugo Boss) మార్కెట్లోకి తీసుకొచ్చిన స్లిప్పర్స్ మోడల్, వాటి రేటుపై నెటిజన్లు పంచ్‌లు పేలుస్తున్నారు. ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై బ్లూ ఫ్లిప్-ఫ్లాప్ స్లిప్పర్స్ రేటు రూ.8,990 ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. అది కూడా 54 శాతం డిస్కౌంట్ పోనూ ఈ భారీ రేటు చూపిస్తోంది. అయితే విచిత్రం ఏమిటి అంటే ఆ చెప్పులు బాత్రూమ్ లో వినియోగించే చెప్పులలా కనిపిస్తున్నాయి. దీంతో ఆ చెప్పుల కంపెనీపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి బాత్రూమ్ చెప్పులు డ్యూడ్ అని ఒకరు అంటే.. ఇవి చోర్ బజార్ లో 50 రూపాయలకి దొరుకుతాయి అని మరొక నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఈ బాత్రూం చెప్పుల ధరతో ఓ ఫోన్ కొనుక్కోవచ్చు అంటూ జోకులు పేలుస్తున్నారు. వినియోగదారులలో నమ్మకం కలిగిన ఆ కంపెనీ మరి ఇంత పాత డిజైన్ లో, అంత ఎక్కువ రేటుతో చెప్పులు విడుదల చేయడం ఆ కంపెనీ నిర్లక్ష్యానికి, కంపెనీ ఉద్యోగుల బద్దకానికి నిదర్శనం అని మరి కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.