Pushpa Mother : టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీ పుష్పతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇందులో దేవీశ్రీ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక ఈ సినిమాలో నటీనటులు అందరూ తమ పాత్రల్లో జీవించిన సంగతి తెలిసిందే. అయితే కీలక పాత్రల్లో నటించిన నటీనటులు అందరూ మనకు తెలిసిన ముఖాలే కానీ అల్లు అర్జున్ కు తల్లిగా నటించిన నటిని మాత్రం ఇది వరకు పెద్దగా సినిమాల్లో చూసి ఉండరు.
దాంతో బన్నీ తల్లిగా యాక్టింగ్ ఇరగదీసిన నటి ఎవరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ నటి పేరు కల్పలత కాగా ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ పుష్పలో వచ్చినంత గుర్తింపు రాలేదు. తాజాగా కల్పలత తనకు పుష్పలో అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది. అందరి లాగే తాను కూడా పుష్ప ఆడిషన్ కు వెళ్లినట్టు ఆమె పేర్కొంది. చిత్తూరు యాసలో మాట్లాడటం కష్టంగా అనిపించిందని కానీ ప్రయత్నించానని తెలిపింది. సరిగ్గా ఆరు నెలల తరవాత తనకు ఫోన్ వచ్చిందని ఆమె పేర్కొంది.

పుష్పలో అవకాశం వచ్చిందని ఫోన్ రావడంతో ఏ పాత్రకు అని అడినని.. దాంతో మీరు ఏ పాత్రకు ఆడిషన్ ఇచ్చారని తిరిగి ప్రశ్నించారని తెలిపింది. తాను తల్లి పాత్రకు ఆడిషన్ ఇచ్చానని చెప్పాగా ఆ పాత్రకే మీకు అవకాశం వచ్చిందని హీరో అల్లు అర్జున్ కు తల్లిగా చేయాలని చెప్పారని వెల్లడించింది. దీంతో తన ఆనందానికి అవధుల్లేవని తెలిపారు. పుష్పలో తాను అల్లు అర్జున్ కు తల్లిని అని కానీ తనకు సుకుమార్ తల్లి అంటూ ఉబ్బితబ్బిబ్బై పోయింది కల్పలత. పుష్ప సినిమాలో బన్నీ తల్లిగా కల్పలతకు మంచి గుర్తింపు దక్కింది. పుష్ప పార్ట్2 లో కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.